Friday, June 4, 2021

అమ్మా అమ్మా ఆదెమ్మా, అయ్యా అయ్యా ఆదెయ్యా

 అమ్మా అమ్మా   మముకన్న తల్లీ మాతల్లీ మాయమ్మా  ఆదెమ్మా, 

అయ్యా అయ్యా మముకన్న తండ్రీ ఆదిదేవుడా  ఆదెయ్యా,

అమ్మా అమ్మా ఆదెమ్మా, అయ్యా అయ్యా ఆదెయ్యా


ముందేడు వరకూ ముచ్చటగా వున్నామయ్యా

మేమందరమూ ఆనందముగా వున్నామయ్యా

అక్కడకు ఇక్కడకు ఎక్కడకయినా ఆనందముగా వురికామయ్యా

ఆ వూరు, ఈ వూరు, ఏ వూరుకయినా  రెక్కలు లేకపోయినా  ఎగిరామయ్యా 

ఆ తిండి, ఈ తిండి, ఏ తిండి అయినా మెక్కామయ్యా, లెక్క లేకుండా మెక్కామయ్యా

అమ్మా అమ్మా ఆదెమ్మా, అయ్యా అయ్యా ఆదెయ్యా


అప్పుడొచ్చాడయ్యా, అప్పుడొచ్చాడయ్యా,

మా తమ్ముడొచ్ఛాడయ్యా, మా కరోనా తమ్ముడొచ్చాడయ్యా

నన్ను కొరికిండు, వాడ్ని గిల్లిండు, దాన్ని రక్కీండు, 

ఎవడ్ని పడితే వాడిని, దేన్ని పడితే దాన్ని

కొరికిండు, గిల్లిండు, రక్కిండు, నొక్కిండు,

గొంతు నొక్కిండు, నాయనుండే శ్మశానం దగ్గరకంపిండు

అమ్మా అమ్మా ఆదెమ్మా, అయ్యా అయ్యా ఆదెయ్యా


ముక్కులొ దూరుతాడు, నోట్లోదూరుతాడు, కంట్లో కెలుతాడు,

వాడిష్టం ఎక్కడెకెక్కడకో వెళతాడు మా ప్రాణాలు తీస్తుండు

ముక్కు మూసుకొన్నాము, మూతి కట్టుకొన్నాము, కళ్ళుకు  కూడా

అడ్డము పెట్టుకొన్నాము, 

నిన్న కనిపించిన మిత్రుడు నేడు నేల మీద వుండడము లేదు,

నిన్న మాపిటి అరువిచ్చిన షావుకారు నేడెళితే కానరాడు,

పాలవాడు కానరాడు, కూరవాడు మరిరాడు, 

బిక్కు బిక్కు మంటూ తిరుగుతున్నాము, మా వంతు ఎప్పుడు అని

రోజులు లెక్కపెట్టుకొంటున్నాము, 

అమ్మా అమ్మా ఆదెమ్మా, అయ్యా అయ్యా ఆదెయ్యా


 ఓ అమ్మ  కొడుకుని మోసే కాటికి ఆ నలుగురే కరువయ్యీ

తన నలుగురు కొడుకులు పోయే, మరో అమ్మ  గుండె ఆగె,

పాపకు నాన్నా, అమ్మా పోయే

బాబుకు అందరు పోయే, మరి అన్నము దొరకా

అమ్మా అమ్మా ఆదెమ్మా, అయ్యా అయ్యా ఆదెయ్యా


అమ్మా అమ్మా , అయ్యా అయ్యా 

మీరేనయ్యా, మీరేనయ్యా మాకు

దిక్కు అయ్యా, మా కరోనా తమ్ముడి

కరాళ నృత్యాన్ని, మారణ హోమాన్ని

మానమని చెప్పాలయ్యా, చెప్పాలయ్యా

ఈ మృత్యుకేళిని మానాలని చెప్పాలయ్యా

అమ్మా అమ్మా ఆదెమ్మా, అయ్యా అయ్యా ఆదెయ్యా