Wednesday, June 28, 2017

నా జీవితములో దుర్భరమయిన రోజులు

ఈ రోజు ఓ యువకుడు తను ఇ0కా జీవితములో సెటిల్ అవ్వలేదని క0గారు పడుతూ వు0టే నేను నాలుగు మ0చి ఓదార్పు మాటలు చెప్పడము జరిగినది. అప్పుడు అనిపి0చినది నా జీవితములోని కొన్ని నగ్న సత్యాలు వ్రాస్తే తప్పు ఏమి వు0ది అని. వ్రాయనా మరి.

నేను 10 వ తరగతి వరకూ జలద0కి అని పల్లెటూరులో చదివాను. కనుక బయటి ప్రప0చము గురి0చి ఎక్కువగా తెలియదు. కావలిలో ఆ స0వత్సరమే ప్రార0భి0చిన కాలేజిలో ఇ0టరు చేరాను. అ0దువలన మాకు ఇ0జనీరి0గు ఎ0ట్రన్స్ గురి0చి తెలియదు. నాకు ఇ0టరు మొదటి స0వత్సరములొ కాలేజీలో ఫస్ట్ వాచ్చాను. రె0డవ స0వత్సరము చివరలో వు0డగా, నా కన్నా తక్కువ వచ్చిన ఎన్. జయచ0ద్రారెడ్డి అనే అబ్బాయి, ఓ రోజు ప్రిన్సిపాల్ స0తకము కోసము ట్రై చేస్తూ వు0టే, ఏమిటి అని అడిగితే వాడు ఇ0జనీరి0గు ఎ0ట్రన్స్ అప్లై చెయ్యడానికి అని అన్నాడు. అలా దాని గురి0చి తెలిసి నేను అప్లై చేసాను. అలాగే నా ఇ0కో ఇ0గ్లీషు మీడియము మిత్రుడు, ఎన్. శివకుమార్ ద్వారా ఇ.ఇ.టి గురి0చి. అతను గు0టూరు రవి ట్యుటోరియల్ కు కోచి0గ్ కు వెళితే, నేను వెల్లాను. కానీ మా నాన్న, బ0ధువుల ఇ0టిలో వు0చడము వలన, మరియూ నాకు అమ్మను వదిలి వెల్లడము అలవాటు లేన0దువలన, 15 రోజులలో వచ్చేసాను. ఏమయితేనేమి, నాకు 1132 రా0కు వచ్చినది. ఆ స0వత్సరములో అన్నీ కాలేజిల్లో రా0కు మీద సీట్ యివ్వన0దువలన సీట్ రాలేదు. నా 10 వ తరగతి ఫ్రె0డ్ ఒకడికి 1032 రా0కు వచ్చి తిరుపతిలో చేరాడు. వాడికి ఇ0టరు మార్కులు ఎక్కువ వచ్చాయి.

నాకు బి యస్సీ చేరడము ఇష్టము లేదు. మా మణి బావ ఫ్రె0డు ఒకతను AMIE మద్రాసులో చేస్తూ వు0టే, నన్ను అక్కడ చేర్ఛారు. కానీ భాష కష్టాల వలన రె0డు నెలల్లో తిరిగి వచ్చేశాను.

అప్పుడు మొదలయ్యాయి నాకు ఖఠినమయిన దినాలు. మా తమ్ముడితో నాకు ఎక్కువగా ఫయిటి0గ్ అవుతూ వు0డేవి. మా అక్కకు పెళ్ళి అయ్యి కూడా కొద్ది నెలలే అయినవి. ఆ టెన్షనుల వలన మా అమ్మ త్వరగా ఇరిటేట్ అవుతూ వు0డేది. మేము ఫయిటి0గ్ చేస్తూ వున్నపుడు తను తల కొట్టుకొనేది. మేము అపే వాళ్ళము. అలా ఓ రోజు ఇ0టిలోను0డి  వేళ్ళి రైల్ కట్టమీద నడుస్తూ వేళ్ళాను. అర్ధము అయ్యి0దా? అది కూడా ట్రై చేసాను. ఎలాగో క0ట్రోలు అయ్యి సాయ0కాలినికి ఇ0టికి వచ్చాను. అది నా మొదటి ప్రయత్నము.

అలాగే ఓ రోజు రాత్రి, ఇ0ట్లో వున్న అన్ని మ0దులు తినేశాను. ఓ గ0ట తర్వాత అమ్మను లేపి చెపితే, డాక్టరు చౌదరి గారి దగ్గరకు  మా శ్యామ్ బావ తో కలసి తీసుకెళ్ళారు. ఆయన ఉప్పు నీళ్ళు త్రాగి0చమని, కొన్ని మ0దులు ఇచ్చారు. అది, నా రె0డవ ప్రయత్నము.

ఆ రోజులలో మా ఇ0కో బావ, మోహన్ బావ, ఉద్యాగాల కోసము ప్రయత్నిస్తూ వు0డేవాడు. ఆయన ఓ ట్రాన్స్ పోర్ట్ ఏజన్సీ తీసుకొని నన్నూ రమ్మని అడిగితే వెళ్ళడము మొదలు పెట్టాను. అక్కడే నేను నా మొదటి జీతము, మొదటీ అమ్యామ్యా లు (టిప్స్) తీసుకొన్నాను. ఆయనకు (మా Mohan బావకు) బా0కు    జాబ్     వచ్చిన0దువలన, అ0తా నా మీద పడినది. అలా మూడు నాలుగు నెలలు జరిగినది. రోజు మనీ వస్తున్న0దువలన ఆన0దముగానే వు0డేది. నాకు లోకము అర్ధము కూడా అయ్యినది.

మా అమ్మా నాన్నలు, ఎలాగయితేనేమి, దానిని వదిలి, మరల ఎగ్జామ్ వ్రాసి 489 రా0క్ తెచ్ఛుకొని తిరుపతిలో చేరాను. అలాగా ఆ స0వత్సరము నా జీవితములో చాలా కష్టమయినది.

No comments:

Post a Comment