ఇసుక గూళ్ళు – ఇ0జనీరి0గు
అవి మేము నెల్లూరు జిల్లాలోని
జలద0కి అనే ఊరిలో వున్న రోజులు. మా నాన్న హెల్త్
డిపార్ట్ మె0ట్ లో పని చేసేవారు. 1971 లేక 1972 స0వత్సరము అనుకొ0టాను. నెల్లూరి జిల్లాలోని
కనిగిరి అనే ఊరును0డి బదిలీ అయి జలద0కి వచ్చాము. మా బాల్యము అ0తా అక్కడే జరిగి0ది.
అ0దువలనే ఆ ఊరును మేము మా ఊరు అని అ0టూ వు0టాము. ఆ ఊరిలో మాకు ఇల్లు లేదు, పొలము లేదు
అయినా గడచిన 40 స0వత్సరాలుగా స్నేహితులు వున్నారు.
నెలకు ఒక్క సారయినా ఊరి విశేషాలు తెలుస్తూవు0టాయి. మా అమ్మాయి ఇప్పటికీ అబ్బుర పడుతూ వు0టు0ది, ఎలా ఇన్ని స0వత్సరాల ను0చి
రిలేషన్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు అని. ఈ మధ్యనే నాకు ఆప్తుడు అయిన దేవరపల్లి నారాయణ
రెడ్డి కూతురు పెళ్ళికి సకుటు0బ సమేతముగా వెళ్ళి
వచ్చాము. మాకు (అనగా నాకు, మా అక్కకు, మా తమ్ముడుకు), ఆ ఊరుతో వున్న స0బ0ధము వెల కట్టలేనిది.
ఆ వూరు మొత్తము మీద,
ఒకరికో ఇద్దరుకో మోటారు బైకు వు0డేది. సౌ0డ్ పొల్యూషను, వాయు, నీరు, పొల్యూషనులు కూడా
ఏవీ వు0డేవి కావు. అ0దువలనేనేమో ఆ రోజులలో రుతువులు క్రమముగా వచ్ఛేవి. వర్షాకాలము అనగా, తప్పకు0డా వానలు పడుతూ వు0డేవి.
ఇప్పటిలాగా కాదు. వారములో మూడు రోజులయినా వానలు పడేవి. అది కనుక సెలవు రోజు అయితే,
మా అల్లరి అ0తా యి0తా కాదు. వాన పడక ము0దు ఉరుములూ మెరుపులూ వస్తూ వు0టే, అ0దరమూ గిర
గిరా తిరుగుతూ “అర్జునా, ఫల్గుణా” అని అరుస్తూ వు0డేవారము. తర్వాత, చిన్న చిన్న తుప్పర
చినుకులు పడుతూ వున్నపుడు, “వానా వానా వల్లప్పా, వాని తమ్ముడు ..”, అని పేద్ద గొ0తులతో
అరుస్తూ గిర గిర తిరుగుతూ వు0డేవాళ్ళము. ఇ0తలో అమ్మ అయినా, నాన్న అయినా, వేరే పెద్దవాళ్ళు
గదమాయి0చేవారు. వానలో తడిస్తే జలుబు, జ్వరము వస్తాయి అని. అ0తే యి0టిలోనికి పరిగెత్తి
కిటికి పైకి ఎక్కేవాళ్ళము. కీటికీ ప్లేస్ ఎవరు ము0దు వస్తే వాళ్ళదే మరి!. కీటికీ లో
ను0చి చేతులు బయటకు చాచి వాన నీళ్ళను పట్టుకొనే వాళ్ళము. ఇ0కా, మా ఇ0టికీ అయితే, రూఫ్
మీద పడ్డ నీళ్ళు కి0ద పడటానికి ఓ పైపు వు0డేది. దానిళొ ను0చి నీళ్ళు చాలా స్పీడ్ గా
పడేది. వాటిని చేతులతో పట్టుకొ0టూవు0టే, ఆ చినుకులు పడి పరుపు తడిచేది. మా అమ్మ తిడుతూ
వు0డేది. ఇలా వు0డేది మా అల్లరి.
ఈ లోపల వాన నీళ్ళలో
పక్కి0టి వాడి కాగితము పడవ కనిపి0చేది. అ0తే,
మేము మా పాత పుస్తకాలను పర్ పర్ అని చి0చి మేము పడవలు కిటికీ ను0చి వదిలే వాళ్ళము.
మామూలు పడవ, కత్తి పడవ, అని వెరే వెరే పడవలు చేసి వదిలే వాళ్ళము. వాన వెలసిన తర్వాత,
ఎవరి పడవ ఎ0త దూరము వెళ్ళి0ది అనే సవాలు కుడా వు0డేది మరి.
ఇక్కడ ఇ0కో విషయము చెప్పాలి.
మా పాత నొట్ పుస్తకాలను పైన వున్న ఆటకలో ను0చి తియ్యగానే, మాకు వ0ట యి0టిలోను0డి స్ట్రిక్ట్ ఇ0స్ట్రక్షన్స్ వు0డేవి మా అమ్మ ను0చి. ఖాలీ పేపర్లను
విడిగా పెట్టాలి అని. మేము వాడిన పేపర్లను మాత్రమే పడవలు తయ్యారు చేసుకోవచ్చు.
తెల్ల పేపర్లను విడిగా పెడితే, మా అమ్మ అవన్ని0టిని ఓ నోట్స్ లాగా కుట్టేది. దానిని
రాబొయె స0వత్సరము క్లాస్ లో, మేము వాడాలి మరి. అలాగా మా అమ్మ ఎకనామిక్స్ ఫాలో అయ్యేది,
అది మాకు అర్దము అయ్యేది. యిప్పుడో? మేమూ పేరె0ట్స్ అయ్యాము కాని, యిలా0టివి చెయ్యలేక
పోతున్నాము. ఒకరో, యిద్దరో శు0ఠలు మాత్రమే మరి!!!. గారాము ఎక్కువ ఈ కాలము పిల్లలకు.
మా అమ్మ నోట్స్ తయారు చేయడము, అనగా దబ్బలము తో కాగితాలు అన్ని0టిని కలిపి కుట్టడము,
బ0క, మరియూ అట్టతో బై0డ్ చేయడము మొదటలో చూసేవాళ్ళము, పెద్ద అనగా 10 ఏళ్ళు వచ్చేసరికి
మేమే అన్నీ చేస్యుకొనే వాళ్ళము. అలాగా చేతులకు పని (dexterity) వచ్చేవి. ఈ కాలము పిల్లలో
మరి?. బెబ్బే. బెబ్బే.
వాన ఆగి, ఇ0కా నీటి
ప్రవాహము వున్నాపుడు మొదలయ్యేది మా ఇ0జనీరి0గు స్కిల్ ప్రదర్శన. ఈ రోజులాగా, రోడ్డులు
తారువి, సిమె0టువి కావు. కనుక, వీధి అ0తా ఇసుక మేటలు, మధ్యలో నీరు. అ0తే, ప్రతి వక్కరూ
ఓ సివిల్ ఇ0జనీరు అయ్యి ఆనకట్టలు ( డామ్ ) కట్టే వాళ్ళము. డామ్, మరియూ కాలువలు, పొలాలు అని ఓ మోస్తరి నీటి
మేనేజిమె0ట్ అక్కడే వాడేవాళ్ళము. పెద్ద కాలువ
అని, చిన్న కాలువ అని, పిల్ల కాలువ అని, దొఱువు అని, ఇలా ఊరిలో వు0డే ఇరిగేషను సిస్టమును
రిప్లికేట్ చేసావాళ్ళము. ఎవరూ చెప్పేవాళ్ళు
కాదు. ఓ రైతు తన పొలానికి నీళ్ళు కావాలని అడగడము, ఎక్కడెక్కడ లాకులు ఎత్తాలో అక్కడ
ఎత్తడము ఇవన్నీ మా ఆటలలో కనిపి0చేవి. మెట్టపొలాలకు నీరు రావాల్0టే, కాలువమధ్యలో చెక్కతో
అడ్డము పేట్టేవాళ్ళు. అలాగే మా సిస్టములో కూడా వు0డేటట్లు చేసేవాళ్ళము. అ0తే కాకు0డా,
మా డామ్ లోనికి నీరు రాకపొతే పైన వున్న వాడిని నీరు వదలమని అడిగే వాళ్ళము. ఇలా వు0డేది
మా బాల్యము.
నీటి ప్రవాహము పూర్తిగా
ఆగి పొయిన తర్వాత, వేరే రకమయిన ఆటలు ఆడేవారిమి. అవేమిటి అనగా, గుడులు కట్టి ప0డుగలు
చెయ్యడము. రోడ్డు మీద వున్న తడి ఇసుకతో శ0ఖువు ఆకారములో ఇసుకను తయ్యారు చేసి, దిగువున ఎలిప్స్ ఆకారములో హోల్ చేసి, అ0దులో దేవుడు
బొమ్మలను వు0చేవారిమి. ఎవరు ఎ0త పెద్ద గుడి కట్టారు, గోపురము ఎ0త అ0దముగా పూలతో అల0కర్0చారు
అన్నది ఇక్కడ వు0డె చాలె0జ్. ఇసుక ఓ పర్టిక్యులర్ యా0గిల్ వరకే పడి పోకు0డా వు0టు0ది.
ఇక్కడ ఇది ఇ0జనీరి0గు సూత్రము మరి. శ0ఖువు
ఆకారములో ఇసుకను తయ్యారు చేసే టప్పుడు, ఇసుకను, గట్టిగా కొడుతూ వు0టే, మనము పెద్ద ఎత్తులో
గుడి చెయ్యవచ్చు. ఇది కూడా ఇ0జనీర్0గు సూత్రము
మరి. అ0తే కాదు, ఆ శ0ఖువు ఆకారములో ఎలిప్స్ ఆకారములో హోల్ చేయాలి. అది ఎక్కువ అయితే
గుడి అ0తా కొలాప్స్ అవుతు0ది. వీటని అన్ని0టిని అధిగమి0చి, ఎవరు పేద్ద గుడి కడుతారో,
వాళ్ళే విన్నర్. ఆడపిల్లలు గుడిని, చుట్టూ వున్న ప్రహరీతో కలపి పువ్వులతో అల0కరి0చేవారు.
వాల్లే ఇ0టి ఇ0టికీ వెళ్ళి గుడిని చూడమని పేర0టానికి పిలెచేవారు. మరమరాలు(బొరుగులు),
బెల్లము, వేయి0చిన సెనగపప్పు అన్నీ కలిపి ప్రసాదములాగా కూడా ఇచ్చేవాళ్ళము.
నేను 9 వ తరగతిలో వున్నప్పుడు
అనుకొ0టా, ఓ విలక్షణమయిన పని కూడా చేసాను. అదేమిటి అనగా, గుడి భూగర్భములో వున్న మరో
గుడి. ఇప్పటికీ, దానికి స0బ0ధి0చిన గుర్తు నాదగ్గర వు0ది. ఈ స్పెషల్ గుడి ని చూసుకోవడానికి,
సెక్యూరిటికూడా మరి. ఓక్కోక్కరు, ఒక్కో టైమ్ లో దానిని కాపలా కాసే వారిమి. మనకు తప్పకు0డా
అపోజిషను వు0టారు కదా? అలాగే నాకూ. జరగాల్సి0ది. జరిగిపోయి0ది. గుడి ఓ రోజు పడి పోయి0ది,
దేవుడూ లేడు. ఓ మై గాడ్. పేద్ద యుద్ధము. ఫైటి0గ్ సీన్స్. ప్రమాణాలు దేముడి ము0ద. కర్పూరము
చేతిలో వెలెగి0చుకొని ఎవరు ఎక్కవ సేపు వు0టే వాడు చెప్పేది నిజము. ఈ దిగువున ఇచ్చిన
చిత్రములో నా ఎడమ చెయ్యి అఱచేయిలోని కాలిన మచ్చచూడవచ్చు. నేనే ఎక్కువ సేపు వు0చుకొని
గెలిచాను అనుకో0డి. కానీ తర్వాత, నెల రోజులు టు కి వెళ్ళి యాస్ కడుక్కొనేటప్పుడు నిజము
అ0త భయ0కరమా అని అనిపి0చేది. అ0తే కాక, నాన్న దెబ్బలొ, అమ్మ దెబ్బలు బోనస్ మరి. స్కూల్
లో యీ విషయము పొక్కి, టీచర్లు తిట్లు. ఎనీ
హౌ, హీరోగా అవతరి0చాము. మరచి పొయాన0డీ బాబూ. ఆ భూగర్భ గుడికి, మెట్లు కూడా న0డి. ఇ0జనీరి0గు
బాబూ ఇ0జనీరి0గు!!!
వానాకాలములో ఎక్కువగా
జ్వరాలు వస్తాయి. మేము ఈ గుడులు, డమ్ లు చేతులతో కట్టడము వలన, వానలో తడవడము వలన, జ్వరాలు
వచ్చేవి. ఒక్కరికి వస్తే, అ0దరికీ వచ్చేవి. మా నాన్న హెల్త్ డిపార్ట్ మె0ట్ కనుక, మాకు
జాగ్రత్తలు (సోప్ తో వాష్ చేసుకోవడము) చెప్పెవారు, మ0దులుకూడా రెడీగా వు0డేవి. అదియును
కాక, అప్పుడు తినే పద్ధతుల వలన, వయస్సు తక్కువ అయిన0దువలన, ఒక్క రొజులో లేచి పరిగెత్తె
వాళ్ళము.
వాన ఆగి పొయి, చీకటి
పడిన తర్వాత, మనము బుడ్డి దీపము పెట్టుకో0గానే, ఎక్కడను0చి వస్తాయో, రెక్కల చీమలు
(మా నెల్లూరు భాషలో వుసుర్లు అనేవారు). మనలను చదువుకోనివ్వవు, ఏమి చెయ్యనివ్వవు. దీపము
ఆపితేనే వాటీ పీడ వదిలేది. దీపాలన్ని ఆపి, మెట్లమీద కూర్చుని వు0టే, పక్క యి0టి రెడ్డిగారి
అబ్బాయి, కఱ కఱ తన జోబీలో ను0చి తీసి తి0టూ వు0టే, మేము అవి ఏమీటి అని అడుగుతే, వాడు
చెప్పిన ఆన్సరు విని మేము ముఖము చిట్లి0చే వాల్లము. ఎ0దుకనగా, మేము వెజిటేరియన్స్ మరి, వాడు తినేవి ఆ వుసుర్లని మరి!!!. పప్పు అయిన, వుప్పు సెనగలు అయినా, మరమరాలు అయినా తినే వాళ్ళము.
పొటీ మరి. మా నాన్నకు సెలవు అయి, వర్షము వస్తున్న రోజు అయి వు0టే, మా అమ్మ పచ్చి సెనగలను
ఓ గ0ట నీళ్ళల్లో నానపోసి, ఆరబెట్టి నూనెలో
వేయి0చి ఉప్పుకారము చల్లేది. మాకు అవి వుసుర్లు మరి. ఈలాగా, మా వానా కాలము జరిగేది.
ఒక్కో స0వత్సరము, వరసగా
కొన్ని రోజులు జడ్డి వాన (ఎక్కువా, కాదు, తక్కువా కాదు), పడుతూనే వు0డేది. మేము వున్న ఇల్లు చాలా
ఓల్డ్ అయినది. సిమె0టు కూడా లేని రోజులలో కట్టినది. సున్నము వాడి కట్టారు. అప్పుడప్పుడే సిమె0ట్ వాడుతున్నారు.
మా యిల్లు కొ0త మిద్దె,
కొ0త, టైల్స్ (పైన వున్న చిత్రము చూడ0డి). వు0డేవి. మిద్దె అనగా, ఇటుకల గోడలపై మంచి దూలాలను వుంచి వాటిపై అడ్డంగా సుమారు నాలుగంగుళాల ఎత్తు, రెండంగుళాల మందం ఆరు, ఏడు అడుగుల పొడవు గల కర్రలను (వీటిని దంతులు అంటారు.) అమర్చి., దానిపై చదునైన పల్చని చక్కలను వేసి వాటిపై సన్నని ఇటుకలను పేరుస్తారు. మా ఇల్లు చాలా ఓల్డ్ అయిన0దువలన, ఈ జడ్డి వానలకు, నీల్లు
కారేవి. ఎక్కడ కారుతున్నయో అక్కడ బకెట్స్ పెట్టి నీరు పట్టి బయట పారపొసే వారిమి. ఆ
పేరు చెపుకొని అయినా బయటకు వెళ్ళి వానను ఎ0జాయె చేస్తూ వు0డే వారిమి. ఒక్కోసారి, పె0కులు
అన్నీ తీసి, ఏవయినా విరిగి పొయివు0టే, కొత్తవి పెట్టి నీరు లీకులను తగ్గి0చే వారిమి(ఇ0జనీరి0గు
మరి!!). ఆ పైన వున్న చెక్కలు బాగా తడిచి వున్న0దువలన, ఒక్కోసారి తేలులు, పాములు కనిపి0చేవి.
ఎవరినో తేలు ముద్దు పెట్టుకొన్న ట్లుగా లీలగా గుర్తు. వానా కాలము ఇల గడిచేది.


సర్ .. మన జీవితాలలో నాటి అందమైన కాలం జర్రున జారిపోయింది కదా! ఇప్పటి పిల్లలకి ఆ విషయాలు చెప్తే అదొక అద్భుతమైన ఫాంటసీ. యెంత గొప్ప గ్రాఫిక్స్ కూడా ఆ ఫాంటసీని అందుకోలేవు కదా.
ReplyDelete