ఓరేయ్ బాబూ ఆగు. జీవితాలు తిరగబడతాయిరా!
నేనో మధ్య తరగతి మనిషిని. ఓ చిన్న కంపెనీ లో సూపర్ వైజరుగా పనిచేస్తూ, నా భార్యా ( ఇందుమతి ) ఇద్దరు పిల్లలుతో ఓ అద్దె ఇంటిలో జీవనము కొనసాగిస్తున్నాను. పెద్దవాడు రమేష్ దేవుడి దయవలన నేను చదివిన యస్. వి. యూనివర్శిటి లోని యూనివర్శిటి క్యాంపస్ ఇంజనీరింగు కాలేజీలో మెరిట్ సీటు తెచ్చుకొని ఇ.బి.సి ఫెలోషిప్ తో మూడవ సంవత్సరము చదువుచున్నాడు. చిన్నవాడు రవీన్ నేను వున్న వూరిలోనే ఇంటరు మొదటి సంవత్సరము చదువుచున్నాడు. వున్నంతలో అందరమూ ఆనందముగానే వున్నాము.
ఇక్కడ మా ఆవిడను మెచ్చుకోకుండా వుండలేను. నేను తెచ్చిన నెల జీతముతో పొదుపుగా ఇంటిని నడుపుతూ, నాకు తలలో నాల్కలాగా వుంటుంది.
ఓ రెండు రోజులు నాకు సెలవులు వస్తే, మా ఆవిడ ఇందుమతి, రవీన్ తో కలసి తిరుపతి బయలుదేరాము, ఆ తిరుమల వేంకటేశ్వరుని దర్శనము కొరకు. తిరుపతి చేరేముందు రమేష్ కు ఫోన్ చేస్తే తను, తన మిత్రులు కూడా మాతో పై తిరుమలకి వస్తామని చెప్పినందువలన బస్సు దిగగానే మా వాడికి ఫోన్ చేసాను. అందరమూ కలసి మెట్లమీద నడుస్తూ తిరుమల వెళ్ళాలని మా ప్లాన్. వాడు ఫోన్ ఎత్తి వాళ్ళందరు యూనివర్శిటి క్యాంపస్, మెడికల్ కాలేజి క్యాంపస్ ల ద్వారా అలిపిరి దగ్గరకు వస్తున్నామని, మమ్మల్ని కుడా డైరక్ట్ గా అక్కడకు రమ్మని చెప్పి ఫోన్ పెట్టాశాడు.
మేము కపిలతీర్ధము రోడ్డు మీదకు వచ్చి ప్రక్కనే వున్న టీ బంకులో యిడ్లీలు తిని, టీ త్రాగి, ఫ్రీ బస్సు కోసము వెయిట్ చేసి, దానిని ఎక్కి అలిపిరి లో దిగాము. పెద్దవాడు, వాడి మిత్రులు వస్తారని, మా ఆవిడ చాలానే తీసుకొని వచ్చింది. కొద్దిగా బరువుగానే వుంది ముగ్గురికి. ఇంతలో పెద్దవాడు, వాడి నలుగురు ఫ్రెండ్సు వచ్చేశారు. అంతవరకూ మేము ముగ్గురమూ ఓ చెట్టు క్రింద వున్నాము. ఎందుకనో టి.టి.డి వాళ్ళను అభినిందించకుండా వుండలేకపోయాను. అంత ఎండా కాలములో కుడా ఎంతో చల్లగా అహ్లాదకరముగా వుంది ఆ ప్రదేశము అంతా.
అమ్మా, నాన్నా, వీడు గిరి, వీడు నవీన్, వీడు ప్రవీణ్, మరి వీడు ఆకాశ్ అని, మా పెద్దోడు వాడి మిత్రులను మాకు పేరు పేరునా పరిచయము చేశాడు. కుశల ప్రశ్నలు అన్నీ అయిన తర్వాత మా ఆవిడ, మేము తెచ్చిన వాటిని అన్నింటిని ఒక్కొక్కటి ఓపెన్ చేసి తను తెచ్చిన పులిహోర, పెరుగన్నము, ఉల్లిపాయ పకోడీలు ఒక్కో పేపరులో పెట్టి వాడికి, వాడి మిత్రులందరికీ ఇచ్చింది. నేనూ, చిన్నోడు మంచి నీల్లు గ్లాస్ లలో పోసి వారికీ ఇచ్చాము. అలాగా, మేము తెచ్చిన సంచీలలో ఒకటి ఖాలీ అయ్యింది. మా ముగ్గురి బట్టలు, మా పెద్దోడి కొసము తెచ్చిన స్వీట్స్, మిగతా తినుబండారాలు వున్న రెండు మాత్రమే మిగిలాయి. మా పెద్దోడు వాటిలో తను హాస్టలుకు తీసుకొని పొవలసిన సంచీని క్లోక్ రూమ్ లో వుంచి, మా బట్టలు వున్న దానిని పై తిరుమలకు ఫ్రీగా తెచ్చి ఇచ్చేవారికి యిచ్చి రశీదులు తీసుకొన్నాడు. అలాగా, యిప్పుడు ఏ బరువూ లేకుండా మెట్లు ఎక్కడానికి తయ్యారు అయ్యాము.
అందరమూ మాట్లాడుకొంటూ మెట్లు ఎక్కసాగాము. మా చిన్నోడూ ఆ పిల్లలతో కలసి మా కన్నా ముందు వెల్లసాగాడు. వాల్ల అల్లరి చూస్తూ వుంటే నా కాలేజిరోజులే గుర్తువచ్చాయి. స్వతహాగా పిల్లలు అమ్మతో చనువుగా వుంటారు. మా పిల్లలు కూడా. నేను అంత ఎక్కువుగా మాట్లడను. అలా అని చెడ్డవాడిని కాదు. నేనూ వాళ్ళ వెనుకగా ఓ పది అడుగుల దూరములో వున్నాను. అలా ఓ రెండు గంటలు అయ్యేసరికి, మెట్లు అయిపొయి, కాలిదారిలాగ వచ్చింది. మరి కొంచెము దూరము నడిచే సరికి, మాదారి బస్సులు, జీప్ లు, మిగతా వెహికల్స్ వెళ్ళే ఘాట్ రోడ్ లో కలిసింది. అందరమూ రోడ్డుకు ప్రక్కగా నడుస్తూ వున్నాము. మా ముందు మా వాడు, వాడి మిత్రులు, ఓ రెండు అడుగుల వెనుక మా ఆవిడా, ఆ తర్వాత నేను నడుస్తున్నాము. ఇంతలో మా వాడి మిత్రులలో ఒకడు రోడ్డు ప్రక్కనే వున్న "బ్లైండ్ టర్నింగ్" ను సూచించే దానిని, లూజ్ గా వుందేమో, లాగేశాడు. దాన్ని చూడగానే, నాకు పట్టరానంత కోపము వచ్చింది.
రేయ్ బాబూ ఆగు. జీవితాలు తిరగబడతాయిరా! అని అరుస్తూ పరిగేడుతూ మా ఆవిడను క్రాస్ చేస్తూ, వాడి ఆ చెంపా ఈ చెంపా వాయించేశాను. వాడిని క్రిందకు త్రోసేశాను. మా ఆవిడా, పిల్లలూ, ఎప్పుడూ నన్ను అంత కోపములో ఎప్పుడూ చూడలేదు. వాడిని నేను ఇంకా కొట్టబోతూ వుంటే, మా పెద్దొడు, వేరే యాత్రికులు నన్ను ఆపారు. అంతే నేను పేద్దగా ఏడుస్తూ, జీవితాలు తిరగబడతాయిరా, జీవితాలు తిరగబడతాయిరా, అని అరవ సాగాను.
అందరూ మాచుట్టూ గుమికూడారు. పిల్లలకూ అర్ధము కాలేదు. నేను ఎందుకు కొట్టానో అని. వారి ఉద్దేశ్యములో, ఆ రోడ్ సైన్ తీసేయడము అంత తప్పుగా అనిపించలేదు. ప్రక్క వారికి కుడా. నేను ఇంకా కుమిలిపోతూనే వున్నాను. అప్పుడు మా ఆవిడ అందరికీ నేను ఎందువలన అలా చేశానో చెప్పడము మొదలు పెట్టింది.
మీ నాన్న కూడా మీ కాలేజిలో ఇంజనీరింగు చదివాడు. తెలుసుకదా? అయినా మీ నాన్న ఓ చిన్న సూపర్ వైజరు జాబ్ లోనే ఎందుకు వున్నాడో తెలుసా అని గట్టిగా అడిగింది. ఇక్కడ ఏదో స్టోరి వుందిఅని దారిలో వెళ్ళే ఇంకొందరు మా చుట్టూ కూచొన్నారు. అందరూ మా ఆవిడ ఏమి చెపుతుందా అని వినడానికి ఆత్రముగా వున్నట్లు మొహాలు పెట్టారు. మనలాగా, మీ నాన్న వాళ్ళ మిత్రులతో కలసి ఓ సారి మెట్లదారిలో తిరుమలకు బయలు దేరారు. అప్పుడు మీ నాన్న కుడా ఇదిగో మీ లాగే అల్లరి అల్లరిగా వుండేవారంట. అది ఆయన చివరి సంవత్సరము. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓ ఎమ్. ఎన్. సి కంపెనీ ఆ రోజులలో అప్పుడే తిరుపతిలో పెట్టారు అంట. దానిలో యస్. వి. యూనివర్శిటి లోని యూనివర్శిటి క్యాంపస్ ఇంజనీరింగు కాలేజీ పూర్వ విద్యార్ధి పార్టనర్ కనుక వారి కాలేజి పిల్లలకు ఇంటర్నషిప్ ఆఫర్ చేస్తే మీ నాన్న కూడా దానిలో చేరాడు అంట. ఆ కంపెనీ క్యాంపస్ ప్లేస్ మెంటుకు ఆ మరుసటి రోజు వారి కాలేజికు వస్తుందని, దానిలో జాబ్ రావాలని వేంకటేశ్వరునికి మొక్కుకోవడానికి బయలు దేరారు అంట ఆ రోజు. మీ వయస్సులో వున్న కోతి బుద్ధులు ఎక్కడకు పోతాయి? ఇదిగో మీ ప్రెండు చేస్తినట్లే ఆయన కూడా ఓ రోడ్ సైన్ ను తేసేశాడు అంట. తర్వాత ఏమి జరిగిందో తెలుసా అని, మా ఆవిడ కాసేపు ఆగి, రిలాక్స్ అవ్వడానికి కాఫీ తాగాడానికి ఫ్లాస్క్ తీసింది. అందరూ ఆవిడ ఎప్పుడు కాఫీ ఫినిష్ చేసి కధ పూర్తి చేస్తుందా అని మొహాలు పెట్టారు.
ఈ లోపల నేను నా కోపము లో నుంచి తేరుకొని, మా ఆవిడతో మిగతా సగము నేను చెపుతా వుండు అని అన్నాను. అలా అన్నప్పుడు నాలో వున్న ఆనందాన్ని మా అబ్బాయిలు వింతగా చూడసాగారు. ఆ మరుసటి రోజు క్యాంపస్ ప్లేస్ మెంట్ అని చెప్పింది కదా? నేను ఇంటర్నషిప్ ఎవరి క్రింద చేస్తున్నానో ఆయన మెంబరుగా వస్తున్నానని, నాకు హెల్ప్ చేస్తానని, ధైర్యముగా ఇంటర్వూకు రెడీ అవ్వమని అంతకు ముందురోజే చెప్పి వున్నారు. నాకు గ్యారంటీగా జాబ్ వస్తుందని ఆనందంలో, ఇంకొద్ది అల్లరిగా ఆ రోడ్ సైన్ ను తీసేశాను. అది జీవితములో సరిదిద్దుకోలేని తప్పని మరుసటి రొజు సాయంకాలానికి గాని నాకు తెలియలేదు.
ఆ మరిసటి రోజు, నేను క్యాంపస్ ప్లేస్ మెంట కు అటెండు అయ్యాను. వ్రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, అన్నీ పాస్ అయ్యాను. చివరి రౌండు కంపెనీ ప్రతినిధులు చేసేది. లోపలికి చాలా ఆనందముగా వెళ్ళాను, నేను గ్యారంటీగా సెలక్ట్ అవుతాను అని. లోపల కెల్లగానే నా ఆనందము అంతా హుష్ కాకి అయ్యింది. నాకు ప్రామిస్ చేసిన ఆయన కనిపించలేదు. నా ప్రాణము సగము చచ్చి పొయింది. వున్న మెంబర్లు ఏవో అడిగారు, నేను ఏదో చెప్పాను, వాళ్ళు నేను చెప్పినదానిని అప్రీషియేట్ చెయ్యలేదు. ఫైనల్ గా నేను సెలక్ట్ అవ్వలేదు. తర్వాత నాకు తెలిసినది ఏమిటి అంటే, నాకు ప్రామిస్ చేసిన్ మెంబరు, వాల్ల బాస్ తో కలసి మేము వెల్లిన రోజు సాయంకాలమే తిరుమల వెళుతూ, యాక్సిడెంట్ లో యిరుక్కొన్నారు అంట. ఆ యాక్సిడెంట్ కు కారణము, రోడ్ సైన్ లేకపోవడము అని. నేను హతాశుడుని అయ్యాను. ఆ తర్వాత, ఏమీ మంచి ఇంజనీరు జాబ్ రాక, ఇదిగో ఈ సూపర్ వైజరు లాగా జీవిస్తున్నాను, అని చెపుతూ, కల్లు తుడుచుకోంటూ మా వాడి ప్రెండు దగ్గరకు వెల్లి బాబూ నన్ను క్షమించు బాబూ అన్నాను. అంకుల్ అదేమి లేదు, మాకు తెలీదు. ఎవరూ చెప్పరు. వయస్సు కదా అని వదిలేస్తు వుంటారు. ఇంకెప్పుడూ ఇలా చెయ్యము అంకుల్ అని బోరున ఏడ్చాడు. అతనిని, భుజము తట్టుతూ నించున్నాను.
ఇంతలో మా వాడి మిత్రులలో ఒకడు వచ్చి, అంకుల్ మీరు పర్మిషను యిస్తే మా కాలేజి ఆన్ లైన్ మాగజైన్ లో దీనిని ఓ కధ లాగా వేస్తాను అని అన్నాడు. దానికి నేను ఎడిటర్ ను, ఈ కధ వల్ల నాకు చాలా పేరు వస్తుంది. నేను నవ్వుతూ సరేనమ్మా అన్నాను. మరలా, మేము లేవబోయేలోపల, ఓ మధ్య వయస్సు వ్యక్తి సార్ అంటూ వచ్చి, మా సార్ మీ కధను మా పత్రికలో ప్రచురించ వచ్చా లేదా అని అడగమన్నారు అని అంటూ వచ్చాడు. దానికేముంది అండీ, మహాభాగ్యము అని అన్నాను. అంకుల్, ఏమి పేరు పెట్టమంటారు అని ఈ లోపల మా వాడి ప్రెండు అరిచాడు. ఏమి చెప్పాలో అర్ధము కాలేదు. సడన్ గా అడిగాడు కదా? " ఓరేయ్ బాబూ ఆగు. జీవితాలు తిరగబడతాయిరా! " అని నేను అరుస్తూ పరిగెత్తడం గుర్తుకు వచ్చింది. అదే పెట్టమన్నాను. ఇంతలో, తల ఇటు త్రిప్పగానే, మా వెనుకే వున్న గుంపులో నుంచి రామోజీరావు గారు, లేచి తన వారితో కలసి కొండ పైకి నడుస్తూ వున్నారు. కళ్ళతోనే ఆయనకు నమస్కారము తెలిపితే, ఆయనా నవ్వుతూ ఎక్కడము మొదలెట్టారు. అదీ కధ. మీరే చెప్పాలి మరి ఎలావుందో.

No comments:
Post a Comment