Thursday, January 10, 2019

నామాల తండ్రి

నామాల తండ్రి
దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.
దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ దండాలు.

దండాలో, దండాలో
ఏడు కొండల ఎంకన్నా దండాలు.

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

ఆ వూరు తిరిగీ, ఈ వురు తిరిగీ
ఆ యమ్మ నడిగీ, ఈ యమ్మ నడిగీ
వచ్చామో, వచ్చాము. నీ దగ్గరకు వచ్చాము.

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.


బచ్చెక్కాము, బండెక్కాము
రిచ్చెక్కాము, చేరామోయి శ్రీనివాసము
చేరామోయి శ్రీనివాసము.

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

అది కావాలంటారు, ఇది కావాలంటారు,
మరి ఇంకేదో ఆధారము అంటారు,
మరేమో, సత్రము లేదంటారు.
తల్లీ, పిల్లా జెల్లా, పైనా క్రిందా
అయినారు, అయినా కానీ
ఎవరికీ గానీ, పట్టలేదు,
మా భాధ ఎక్కలేదు, ఎక్కలేదు.

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

అది చేసి ఇది చేసి, ఎలావోలా స్నానము చేసి,
బుడ్డోడి పాలకెళితే,
పాలే లేవంటారు. శ్రీనివాసములో
పాలే లేవంటారూ.

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

పరిగెత్తి, పరిగెత్తి, అల్లంత దూరం పరిగెత్తి
బుడ్డోడి  పాలు తెచ్చి,  చిన్నదానికి, టిఫిన్ తెచ్చి,
ఎక్కామయ్యా, మల్లా బచ్చెక్కెమయ్యా
కొండెక్కామయ్యా, నీ కొండెక్కామయ్యా

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

చిన్నప్పడు, మా చిన్నప్పడు,
ఎల్లప్పడు, ఎల్లప్పడూ
గోవిందా, గోవిందా,
కొండంతా గోవిందా. గోవిందా
మరిప్పుడూ, ఎక్కడా,
ఆ గోవిందా ఎక్కడా? ఆ గోవిందా ఎక్కడా ఓ గోవిందా?

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

అక్కడంటడు, ఇక్కడంటడు, ఎక్కడకో
ఎల్ల మంటడు, ఏ ఒక్కడూ మాకు
జర చెప్పడు, జర పూర్తిగా జవాబివ్వడూ
ఎందయ్యా, నువ్వేందయ్య, నువ్వేమి పేద్ద
దేవుడివయ్యా, నే పాళె గాల్లేందయ్యా?

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

అక్కడ కెల్లి, ఇక్కడ కెల్లీ,
క్యూ లో కెల్లి, కూసుంటే
కూసాలిరిగే, మా కాసాలిరిగే,

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

కూసోని, కూసీని, పరిగెత్తి, పరిగెత్తి,
ముందోడ్ని నెట్టి, వెనకోడ్ని కసిరి,
పక్కోడ్ని వురిమి, ఆ పక్కోడ్ని తిట్టి
నెట్టి, నెట్టి, పరుగెట్టి గుల్లోకి వచ్చామయ్యా,
నీ గుల్లోకి వచ్చమయ్యా

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

పో పో అంటడు, రారా అంటడు, పద పద అంటడు
తోపిడే తోపుడు, ఆపరూ తోపుడు.
అట్ట చేసి, యిట్ట చేసీ, బుడ్డోడ్ని భుజాలెక్కించి,
చిన్నదాన్ని చంకెత్తుకొని, చూసామయ్యా,
నిన్ను చూచామయ్యా, నిన్ను చూచామయ్యా.
మరి చామయ్యా, అన్ని కష్టాలు మరి చామయ్యా.

దండాలో, దండాలో
మము కన్న తండ్రీ, నామాల తండ్రీ, దండాలు.

No comments:

Post a Comment