Monday, October 8, 2018

అంతులేని ప్రశ్నలు - దేవుడికే మరి.

1. ఆత్మ ర0గూ, రూపమూ, లేనిది అంటారు. మరి పూర్వ జన్మలో చేసినవి దానికి ఎలా అంటుతాయి? అందువలన ఈ జన్మలో మనుష్యులేల కష్టాలు అనుభవించవలె?

2. అసలు శివుని ఆజ్ణలేనిదే చీమ అయినా కుట్టదు అని అంటారు కదా? అయన అలా ఎందుకు ఆజ్ణ యివ్వవలె? అందరూ మంచి పనులే చేసేటట్లు ఆయన చెయ్యవచ్చు కదా? అప్పుడు అన్నీ పుణ్యాలే అవుతాయి కదా? అప్పుడు ఈ భూమే స్వర్గము అవుతుంది కదా? మరో స్వర్గము ఎందుకు? ఇంద్రుడు ఎందుకు?

3. మనిషికి ఆకలి, కోరికలు లేనట్లు పుట్టిస్తే చాలు కదా? అంతా ఆనందమయముగా వుంటుంది. లేకపొతే, ఈ కర్మ ఏమిటి, మూడేళ్ళ పిల్లను రేప్ చెయ్యడమా?

4. ఇవన్నీ చూస్తూ వుంటే, నీ డిజైన్ లో కూడా లోపాలా ఇవి? నిజమేమో అని పిస్తుంది. ఎందుకంటే, రెండు కళ్ళూ, రెండు చెవులూ, రె0డు చేతులూ, రెండు కాళ్ళూ, అన్నీ రెండు ఇచ్చావు. ఎందుకంటే సేఫ్టీ కోసమా? నీ డిజైన్ పని చెయ్యాలనా? నీ మీద నీకే సందేహమా?

No comments:

Post a Comment